KNR: కరీంనగర్ పట్టణంలోని మహిమాన్విత భవ్య, దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం సంకష్టి చతుర్దశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సంకష్ట సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ, గణపతి హోమ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. ఆయా ప్రత్యేక పూజ, గణపతి హోమ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్లతోపాటు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.