WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఫుస్కోస్ ప్రైవేటు పాఠశాలలో మత బోధనలు జరిగినట్లు MEO శ్రీధర్ నిర్ధారించారు. ఇవాళ జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలకు చేరుకుని, యాజమాన్యం, విద్యార్థులతో చర్చించి వివరాలు సేకరించారు. ఓ క్రైస్తవ మతస్థుడు తరగతి గదిలో బోధనలు చేసినట్లు తేలిందని, ఈ విషయం పై పూర్తి నివేదికను త్వరలో DEO కు సమర్పిస్తామని శ్రీధర్ తెలిపారు.