AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, అనకాపల్లి, VSP, NTR, కృష్ణా, బాపట్ల, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.