MDK: చిన్నశంకరంపేట మండలం సూరారం ZP పాఠశాలలో శుక్రవారం కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరారం కాంప్లెక్స్ HM సాయిరెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.