ADB: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ క్యాంపు కార్యాలయం నుంచి నియోజక వర్గంలోని పలువురు నాయకులతో జూమ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. బీజేపీ విధానాలను ఎండగట్టాలని సూచించారు.