HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర ఓబీసీ వర్కింగ్ ఛైర్మన్ వినయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీసీలు వెనకబడ్డారనే విషయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 42 శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.