SRPT: సోమవారం నాటికి జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కి సంబంధించి ధాన్యం సేకరణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని పేర్కొన్నారు.