BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వి హంచారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాల హెచ్ఎం, అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ ప్రమీల మాట్లాడుతూ.. ప్రతీఒక్కరూ బాలికల అభ్యున్నతికి పాటుపడాలని, వారి హక్కులను రక్షించేలా కృషి చేయాలన్నారు.