»Car Sales In April Sales Of Maruti Mg Kia Increased Know Company Performance
Car Sales : ఏప్రిల్‌లో పెరిగిన కార్ల అమ్మకాలు.. ఏ కంపెనీవి ఎక్కువగా అమ్ముడుపోయాయంటే
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పాటు, ఈ సంవత్సరం వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా సమాచారం వెల్లడైంది.
Car Sales : ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కార్ల అమ్మకాలు(Car sales) ఊపందుకున్నాయి. దాదాపు అన్ని కంపెనీ కార్ల అమ్మకాల్లో గ్రోత్ నమోదైంది. ఏ కంపెనీ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉందో నరతెరపైకి వచ్చింది. అలాగే ఏప్రిల్ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించింది దీనితో పాటు, ఈ సంవత్సరం వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా సమాచారం వెల్లడైంది. ఏప్రిల్ లో మారుతి సుజుకితో పాటు హ్యుండాయ్(Hundai), టాటా మోటార్స్(tata motors), కియా(KIA), ఎంజీ కార్లు(MG CArs) అమ్మకాల్లో రెండెంకల వృద్ధి సాధించాయి. కానీ వినియోగదారులు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV)కే ఓటేశారు. చిన్న కార్ల విక్రయం పడిపోయింది.
మారుతి సుజుకి(Maruti Suziki) కంపెనీ కార్ల విక్రయాలు దేశీయంగా 13 శాతం మేరకు పెరిగాయి. 2022 ఏప్రిల్‌లో 1,21,995 కార్లు విక్రయించిన మారుతి సుజుకి.. గత నెలలో 1,37,320 కార్లు విక్రయించింది. ఈ క్రమంలో ఆల్టో(Aultro), ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్ల సేల్స్ 18 శాతం పడిపోయాయి. 2022 ఏప్రిల్‌లో 17,137 యూనిట్లు అమ్ముడు పోగా, గత నెలలో 14,110 కార్ల విక్రయానికే పరిమితం అయ్యాయి. కంపాక్ట్ సెగ్మెంట్లో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ తదితర మోడల్ కార్లు అమ్మకాల్లో 27 శాతం పుంజుకున్నాయి. 2022 ఏప్రిల్‌లో 59,184 కార్లు విక్రయించగా, గత నెలలో 74,935 యూనిట్లే పెరిగాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) మోడల్స్ బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా సేల్స్ ఎనిమిది శాతం వృద్ధి చెంది 36,754 యూనిట్లకు పెరిగాయి.
టాటా మోటార్స్(Tata Motors) సైతం 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో 13 శాతం అమ్మకాలను పెంచుకుంది. గతేడాది ఏప్రిల్‌లో 41,587 కార్లు విక్రయించిన టాటా మోటార్స్ ఈ ఏడాది 47,007 యూనిట్లకు పెంచుకోగలిగింది. దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్(Kia Motors) సేల్స్ 22 శాతం పెంచుకుని 23,216 యూనిట్ల కార్లు విక్రయించింది. గతేడాది కేవలం 19,019 కార్లు మాత్రమే కియా కార్లు అమ్ముడుపోయాయి. విక్రయించింది.
దేశీయంగా హ్యుండాయ్(Hundai) మోటార్ కార్ల సేల్స్‌లో 13 శాతం గ్రోత్ నమోదైంది. 2022 ఏప్రిల్‌లో 44,001 కార్లు విక్రయించగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 49,701 యూనిట్లు విక్రయించింది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆల్ న్యూ వెర్నా సేల్స్ రెట్టింపుకు పైగా నమోదయ్యాయని హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో మార్కెట్లోకి రానున్న మరో ఎస్యూవీ ఎక్స్టర్తో సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే టాటా కిర్లోస్కర్(Tata Kirloskar) సేల్స్ ఆరు శాతం తగ్గి 14,162 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మరోవైపు నిస్సాన్ మోటార్స్ సేల్స్ 24 శాతం వృద్ధితో 2,617 కార్లు విక్రయించింది. ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ రెండు రెట్లు పెరిగాయి. ఇక ఎంజీ మోటార్స్ గత నెలలో 4,551 కార్లు విక్రయించింది.