MBNR: ఈ నెల 28, 29వ తేదీలలో జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీలలో 20 జిల్లాల నుంచి 600కు పైగా క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు.