VKB: పెద్దేముల్ మండలం నాగులపల్లి అంగన్వాడీ నిర్వాహణ దయనీయ స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ఆవరణ చుట్టూ డ్రైనేజీ వాటర్ చేరుతోంది. దీంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వర్షాకాలం చిన్నారులు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ వాటర్ రాకుండా చూడాలని, ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతున్నారు.