NLG: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని DEO బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రికార్డులు, భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులచే పాఠ్య పుస్తకాలు చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.