MNCL: బెల్లంపల్లి పట్టణంలోని సౌత్ కాస్కట్ గని కి సంబంధించిన సింగరేణి భూమి కబ్జా కాకుండా చూడాలని కోరుతూ మందమర్రి ఏరియా GMకి CPI, AITUC నాయకులు శుక్రవారం మెమోరాండం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సింగరేణి స్థలంలో దేవుని విగ్రహాల పేరిట పూజలు చేసి కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. విచారణ జరిపి స్థలాన్ని సింగరేణి స్వాధీనంలోకి తీసుకోవాలని కోరారు.