ప్రకాశం: కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలతో ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయని కనిగిరి వైసీపీ మహిళా అధ్యక్షురాలు పులి శాంతి ఆరోపించారు. శుక్రవారం ఒంగోలులో కల్తీ మద్యంపై నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతుందన్నారు.