MNCL: సమాచార హక్కు చట్టంలో అందిన దరఖాస్తులకు సమాచారాన్ని నిబంధనల ప్రకారం అర్జీదారులకు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. శుక్రవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం ఆవశ్యకమని పేర్కొన్నారు.