TPT: నాయుడుపేటలోని బీడీ కాలనీలో రూ.2కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామన్నారు.