WGL: ఖిలా వరంగల్లో తనకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందని, ప్రొసీడింగ్ కూడా తీసుకున్నానని కొన్ని పత్రికలు తప్పుడు వార్త ప్రచురించాయని 38డివిజన్ కార్పొరేటర్ ఉమాయాదవ్ శుక్రవారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. తాను ఏ కాపీ తీసుకోలేదని, నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు వార్తలు రాసిన రిపోర్టర్లు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువువష్టం దావా వేస్తానని హెచ్చరించారు.