AP: గుంటూరు అన్నపర్రు BC హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవడంపై స్థానిక ఎమ్మెల్యే బూర్ల ఆంజనేయులు స్పందించారు. హాస్టల్‌కి వెళ్లి పరిస్థితిని పరిశీలించిన ఆయన ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వార్డెన్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు వివరించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.