NLG: నాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనులు చేసే కూలీలకు ఈ- కేవైసీ (e-KYC) చేస్తున్నట్లు గ్రామ కార్యదర్శి ఈరోజు తెలిపారు. కూలీలు జాబ్ కార్డు, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఈ- కేవైసీ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యదర్శి కోరారు.