MNCL: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడంలో విఫలమైందని చెన్నూర్ పట్టణ BRS నాయకులు ఆరోపించారు. శుక్రవారం చెన్నూర్ పట్టణం లోని జాలాల్ పెట్రోల్ బంక్ నుంచి తెలంగాణ తల్లి కొత్త బస్టాండ్ ప్రాంతం వరకు ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు.