KMM: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ భావోద్వేగాల నియంత్రణ కలిగి ఉండాలని ప్రిన్సిపాల్ అన్నారు. యువత సోషల్ మీడియాను తగినంతగా ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.