KMM: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మం సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ క్రీడాకారులతో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడి.. వారిలో ఉత్సాహం నింపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.