ATP: ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగ పిల్లలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. సర్వ శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని భవిత కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాల ఎంపిక శిబిరంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 500 మంది ప్రత్యేక అవసరాలు పిల్లలున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.