JGL: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర సరఫరా కోసం 11కేవీ లైన్లలో 117 ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేశారని ఎస్ఈ బీ. సుదర్శనం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, నిర్వహణల సమయంలో లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ నిలిచినప్పుడు, ఈ ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగించగలమని పేర్కొన్నారు.