విశాఖ సీపీ వ్యాఖ్యలపై మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జగన్ Z+ సెక్యూరిటీలో ఉన్న సంగతి సీపీకి తెలియదా? అని ప్రశ్నించారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా జగన్ సభకు భారీగా ప్రజలు వచ్చారని చెప్పారు. సీపీ హుందాగా మాట్లాడాలని, జగన్ను కేవలం MLA అనడం సరికాదన్నారు. 3 వేల మందితో బందోబస్తు ఎందుకో చెప్పాలని, సీపీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.