NRPT: కొత్తపల్లి మండలంలోని భూనేడు గ్రామంలో బీసీ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పై హైకోర్టు స్టే విధించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, తీర్మాలేష్ గౌడ్, జెవర్ధన్, రాము గౌడ్, శ్రీని వాస్ గౌడ్ ఉన్నారు.