SKLM: బూర్జ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో గిరిజన బాలికను మోసం చేసిన సవర పవన్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు.