ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని, ప్రజలు సురక్షిత ప్రాంతలకు వెళ్లాలని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మయన్మార్‌లో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.