CTR: శ్రీరంగరాజపురం మండలం పాతపాలెం గ్రామం ప్రమాద అంచుల్లో ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు దాటాలంటే భయమేస్తుందన్నారు. వరద ఉధృతికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయన్నారు. ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించి శాశ్వతముగా వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.