అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2019కి ముందు 11 కళాశాలలు ఉండగా వైఎస్ జగన్ పాలనలో 17 కొత్త మెడికల్ కళాశాలలు నిర్మించామని తెలిపారు. నవంబర్ 22 వరకు సంతకాల సేకరణ జరిపి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు.