NLR: చేజర్ల మండలం గొల్లపల్లి పంచాయతీలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సీడీపీవో సునీలత ఆదేశాల మేరకు సెక్టార్ సూపర్వైజర్ పద్మ సూచనలతో కార్యక్రమం జరిపారు. అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలంటూ అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తయారీ విధానాలు వివరించారు.