NRPT: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం నారాయణపేట మండలంలోని జాజాపూర్ క్లస్టర్, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని జడ్పీటీసీ, దామరగిద్ద క్లస్టర్ పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.