NDL: జిల్లా అవుకు మండలం మెట్టుపల్లిలో కులాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం ప్రేమ్‌కుమార్, లక్ష్మీదేవి పెద్దల అభ్యంతరాల మధ్య పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల గ్రామానికి రావడంతో కోపంతో ఉన్న కుటుంబాలు కత్తులతో దాడి చేసుకోవడంతో ఐదుగురు గాయపడి, అవుకు ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేశారు.