NZB: ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నిజామాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు. మాధవనగర్ బైపాస్, కంఠేశ్వర్ బైపాస్, అర్సపల్లి, రాజరాజేంద్ర చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, రుక్మిణి ఛాంబర్, హోటల్ నిఖిల్ సాయి ప్రాంతాల్లో ఈ ఆంక్షలు వర్తిస్తాయన్నారు.