MDK: RTC టికెట్ ధరల పెంపుకు నిరసనగా BRS పార్టీ గురువారం ప్రకటించిన చలో బస్ భవన్ కార్యక్రమానికి వెళుతున్న మాజీ MLA పద్మా దేవేందర్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. పెట్ బషీరాబాద్ పోలీసు అధికారులు ఉదయం కొంపల్లిలో ఆమెను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. బస్సు భవన్ వద్ద ఆందోళనకు వెళ్లకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.