ఖమ్మంలో అక్రమంగా వినియోగిస్తున్న పోర్టబుల్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎంహెక్టా డా. కళావతి బాయి తెలిపారు. పి.సి.పి.ఎన్.డి.టి చట్టం ప్రకారం డీఎంహెస్ఓ, అర్బన్ పోలీసుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హిటాచీ మోడల్ స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని, వెంకటేష్, హుస్సేన్ సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.