HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముగ్గురు ఆశావాహుల పేర్లను కేంద్ర నాయకత్వానికి బీజేపీ పంపింది. అయితే 2023లో పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన లంకల దీపక్ రెడ్డి, ఆకుల విజయ, కీర్తిరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై వారి శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.