NTR: వివాహితను వేధిస్తున్న బాలుడిపై విజయవాడ అజిత్ సింగ్‌నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. న్యూరాజరాజేశ్వరీపేట ఓ స్కూల్ సమీపంలో నివసిస్తున్న మహిళతో అదే ప్రాంతానికి చెందిన బాలుడు (16) అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.