ATP: పంటలకు ఈ- పంట నమోదు తప్పనిసరి అని గుత్తి ఏడీఏ వెంకటరాముడు పేర్కొన్నారు. బుధవారం పామిడి మండల పరిధిలోని సొరకాయలపేట గ్రామాన్ని సందర్శించి ఈ-పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. ఈనెల 25 వరకు నమోదు ప్రక్రియకు అవకాశం కల్పించామన్నారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.