SKLM: ఎచ్చెర్ల మండలం ఫరిద్ పేటలో గౌరి పున్నమి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం సాయంత్రం ఈ సంబరాల్లో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.