CM KCR:తెలంగాణ కొత్త సచివాలయాన్ని నిన్న సీఎం కేసీఆర్ (kcr) ప్రారంభించారు. తొలి సమీక్ష సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (palamur-rangareddy lift irrigation) స్కీమ్‌పై చర్చిస్తారు. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ కొడంగల్ వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కావులవలను సమీక్షిస్తారు. సమీక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ (delhi) వెళతారు. ఈ రోజు లేదంటే రేపు హస్తిన వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పార్టీ శ్రేణులు చేశాయి. పార్టీ అధినేత కేసీఆర్ (kcr) గురువారం రోజున కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.
కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు (elections) జరగబోతున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన ప్లీనరీలో (plenary) పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ హితబోధ చేశారు. ప్రభుత్వ పర పనులు, పార్టీ పరంగా ఆవలంభించాల్సిన విధానాలతో కేసీఆర్ బీజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. అందుకోసమే తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పొరుగు రాష్ట్రం ఏపీలో అధ్యక్షుడిని నియమించిన.. ఇటీవల ఎన్నికల సంఘం మాత్రం పార్టీగా గుర్తించలేదు.