WGL: నర్సంపేట పట్టణంలోకి ఆర్డీవో కార్యాలయంను బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద సందర్శించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అదికారులను ఆదేశించారు.