WGL: పర్వతగిరి మండలం కల్లెడలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాల విద్యార్థినులు తమ క్రీడా ప్రతిభను చాటుతూ రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి SGF అండర్ 19 బాలికల విభాగంలో కబడ్డీ పోటీల్లో సుమారు 350 క్రీడాకారులు పాల్గొనగా ఆర్డీఎఫ్ నుండి 04 విద్యార్థులు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ జనార్ధన్ తెలిపారు.