కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార 1’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.427.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.