ATP: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలిశారు. అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ఛాంబరులో కలిసి పలు అంశాలపై చర్చించారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు, నీటి ప్రాజక్టులపై కలెక్టర్‌తో చర్చించారు.