NLG: నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ మాజీ వార్డు సభ్యుడు దోడి నరసింహ మృతిచెందగా… వారి మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.