MHBD: మహబూబాబాద్‌లో వందేభారత్ మెగా మెయింటెన్స్ (POH/ROH) కేంద్రం ఏర్పాటుకు రైల్వే డిప్యూటీ CME స్వరాజ్ కుమార్ రూ.908.15 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేంద్రంలో పీరియాడికల్, రెగ్యులర్ ఓవర్హోలింగ్, ట్రైన్ ఎగ్జామినేషన్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. సరుకు రవాణా రైళ్ల నిర్వహణ పనుల కోసం 300 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు.