KRNL: నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న విష్ణుమూర్తిని నియమించారు. మంగళవారం ఆయన నగరపాలకలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. విష్ణుమూర్తికి పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.