Trisha: త్రిషకు ఆ పొలిటీషియన్తో ఉన్న లింక్ ఏంటి!?
నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్ల కనిపిస్తోంది త్రిష(Trisha). అసలు అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఈ బ్యూటీ అందమే తింటోందా? అనేలా.. క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది త్రిష. ముఖ్యంగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్‌లో త్రిషను చూసి.. ఔరా ఏంటా అందం అనుకున్నారు. ఇక రీసెంట్గా పీఎస్2 ప్రమోషన్స్‌లో త్రిష గ్లామర్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. అలాంటి ఈ బ్యూటీ ఓ పొలిటీషియన్‌ను స్పూర్తిగా తీసుకున్నాని చెప్పింది.
మణి రత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. గతంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ తమిళ్లో మాత్రమే హిట్ అయింది. అక్కడ దాదాపుగా 500 కోట్లు రాబట్టింది. దాంతో పీఎస్2ని గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు మణిరత్నం. అయితే ఫస్ట్ పార్ట్ కంటే.. ఈ సెకండ్ పార్ట్ చాలా బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష(Trisha)కీ రోల్ ప్లే చేశారు.
ఇందులో త్రిష, కుందవై అనే పాత్రలో నటించింది. ఫస్ట్ పార్ట్‌లో త్రిష(Trisha) క్యారెక్టర్ హైలెట్‌గా నిలిచింది. ఈ క్యారెక్టర్ కోసమే త్రిష ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్(politician)ను స్పూర్తిగా తీసుకున్నాని.. ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చింది. పీఎస్ సినిమాలోని తన పాత్రలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత షేడ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.
మణిరత్నం.. ‘త్రిషగా కాకుండా ఆమెలా ఆలోచించండి, ఆమె ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుందో.. అలాగు కుందవై ఉండాలని అన్నారట. దాంతో త్రిష.. జయలలిత గురించి ఆలోచించడం మొదలుపెట్టిందట. ఆమె వీడియోలు, సినిమాలు, మాట్లాడే విధానం చాలా చూసిందట. ఇది తనకు నిజంగా చాలా హెల్ప్ అయిందని చెప్పుకొచ్చింది. దాంతో ప్రస్తుతం త్రిష కామెంట్స్ సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారాయి.