NZB: వర్ని మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదో మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మండల కన్వీనర్ బుడ్డక్కల సాయిలు మాట్లాడుతూ.. మహా సభలు ఈ నెల 24, 25 తేదీల్లో మహబూబాద్లో జరుగుతాయన్నారు. జీపీ వర్కర్స్ అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, బాలరాజు, లక్ష్మి ఉన్నారు.